Hyderabad,telangana, జూలై 13 -- హైదరాబాద్ లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ వర్సిటీలో ఆన్ లైన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో 2025 -2026 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు.

అర్హత కలిగిన అభ్యర్థులు https://braou.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు 13 ఆగస్టు 2025వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈలోపే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ ద్వారా డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరవచ్చు. ఇక పీజీలో చూస్తే ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

డిగ్రీ ప్రవేశాలకు ఇం...