భారతదేశం, నవంబర్ 22 -- అంబానీ వారసుడి పెళ్లి తర్వాత మళ్లీ అంతటి రేంజ్ లో, అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మరో వెడ్డింగ్ జరుగుతోంది. అది కూడా తెలుగమ్మాయిది కావడం విశేషం. ఈ పెళ్లికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయుడు జూనియర్ డొనాల్డ్ ట్రంప్ తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి వచ్చాడు. అంతేకాకుండా సంగీత్ లో డ్యాన్స్ కూడా చేశాడు. జెన్నిఫర్ లోపేజ్, జస్టిన్ బీబర్ వంటి ఇంటర్నేషనల్ స్టార్లు కూడా ఈ వెడ్డింగ్ కు అటెండ్ అవుతున్నారని తెలిసింది.

ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న నేత్ర మంతెన-వంశీ గాదిరాజు గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో డొనాల్డ్ ట్రంప్ తనయుడు పాల్గొన్నాడు. డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అతని ప్రియురాలు బెటినా ఆండర్సన్.. 'రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ' చిత్రంలోని హిట్ ట్రాక్ 'వాట్ జుమ్కా?' కు రణవీర్ సింగ్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఆన్‌లై...