భారతదేశం, మే 17 -- భారత్-చైనా యుద్ధం జరిగినపుడు, 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం జరిగినపుడు.. ఇందిరమ్మ మహిళా శక్తిని ప్రపంచానికి చాటారని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశాన్ని గెలిపించిన శక్తి మహిళా శక్తి అని చెప్పారు. మహిళా శక్తిని కాంగ్రెస్ ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేదన్న రేవంత్.. దేశానికి మహిళలు ఆదర్శం.. మహిళా శక్తి దేశానికి అండ అని నిరూపించినా ఘనత కాంగ్రెస్ పార్టీది అని కొనియాడారు.

'రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తికి చేయూతనిచ్చే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో మా ప్రభుత్వం పనిచేస్తోంది. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి మహిళలకు సోనియమ్మ నజరానా అందించారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో ఆడబిడ్డలక...