భారతదేశం, జూన్ 24 -- బ్యాటింగ్ లో అదరగొట్టి.. ఇంగ్లాండ్ తో తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ సెంచరీలతో హిస్టరీ క్రియేట్ చేసిన రిషబ్ పంత్ కు ఐసీసీ షాకిచ్చింది. హెడింగ్లీ టెస్టు మూడో రోజు ఆటలో అంపైర్ తో గొడవ వల్ల పంత్ కు శిక్ష విధించింది ఐసీసీ. ఈ విషయాన్ని మంగళవారం (జూన్ 24) ఐసీసీ వెల్లడించింది.

ఇంగ్లాండ్, ఇండియా ఫస్ట్ టెస్టు లీడ్స్ లోని హెడింగ్లీలో జరుగుతోంది. ఆదివారం (జూన్ 22) మ్యాచ్ లో మూడో రోజు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తుంది. క్రీజులో హ్యారీ బ్రూక్ ఉన్నాడు. సిరాజ్ బౌలింగ్ వేస్తున్నాడు. ఇన్నింగ్స్ 61వ ఓవర్ అయిదో బంతికి బ్రూక్ బౌండరీ కొట్టాడు. అయితే బంతి ఆకారంపై భారత వైస్ కెప్టెన్ పంత్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తనిఖీ కోసం అంపైర్ వద్దకు వెళ్లాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్ దానిని బాల్ గేజ్ తో పరిశీలించాడు.

బాల్ ష...