భారతదేశం, సెప్టెంబర్ 3 -- ఎరువుల కష్టాలపై చంద్రబాబును వైఎస్ జగన్ ప్రశ్నించారు. మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కానీ రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? అని ప్రశ్నించారు. మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలేనని, బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూల్లో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? అని అడిగారు. మరోవైపు తాజాగా ఉల్లి, చీనీ, మినుము ధరలు కూడా పతనమై రైతులు లబోదిబో మంటున్నారన్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మీలో కనీసం చలనం లేదు చంద్రబాబుగారూ? అని ప్రశ్నించారు.

'ఏటా ఏ సీజన్‌లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి, ఎరువులు ఎంత పంపిణీ చేయాలన్నదానిపై ప్రతిఏటా ప్రభుత్వంలో జరిగే కసరత్తే కదా. మర...