భారతదేశం, మే 19 -- దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి సినిమా భారీ బ్లాక్‍బస్టర్ అయింది. 2005లో రిలీజైన ఈ తెలుగు యాక్షన్ మూవీ ఓ ఐకానిక్‍గా నిలిచింది. ప్రభాస్ కెరీర్‌కు సూపర్ బూస్ట్ ఇచ్చింది. ఈ సినిమా హిందీలో ఛత్రపతి పేరుతోనే రీమేక్ అయింది. తెలుగు హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్.. ఛత్రపతి హిందీ రీమేక్‍తో బాలీవుడ్‍లోకి ఎంట్రీ ఇచ్చారు. 2023లో విడుదలైన ఆ మూవీ అల్ట్రా డిజాస్టర్ అయింది.

ప్రస్తుతం భైరవం సినిమా ప్రమోషన్లలో శ్రీనివాస్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఛత్రపతి హిందీ రీమేక్ ఎందుకు వర్కౌట్ కాలేదో వివరించారు.

ఛత్రపతి హిందీ జనాలకు తెలియదని అనుకున్నామని, కానీ కరోనా టైమ్‍లో చాలా మంది చూసేశారని బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపారు. దీనివల్లే ప్లాఫ్ అయిందనేలా కారణం చెప్పారు. "త...