Hyderabad, ఆగస్టు 6 -- మలయాళ సూపర్ హిట్ సినిమాలు నేరు, గురువాయూర్ అంబలనడయిల్, రేఖాచిత్రమ్ లాంటి వాటితో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన నటి అనస్వర రాజన్. ఈ అందాల మలయాళ నటి నటించిన తాజా సినిమా 'వ్యసనంసమేతమ్ బంధుమిత్రాదిగళ్' ఓటీటీలో విడుదల కానుంది. ఈ కామెడీ మలయాళ మూవీ ఆగస్టు 14 నుంచి మనోరమా మ్యాక్స్ లో అందుబాటులో ఉంటుందని ఈ మధ్యే అనౌన్స్ చేశారు. మరి ఈ డిఫరెంట్ టైటిల్ తో వచ్చిన ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఈ ఏడాది ఎన్నో హిట్ మలయాళం సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి ఈ 'వ్యసనంసమేతమ్ బంధుమిత్రాదిగళ్'. ఈ మూవీ జూన్ 13న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు దాదాపు రెండు నెలల తర్వాత ఈ సినిమా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఓటీటీలో ప్రీమియర్ కానుంది.

మనోరమ మ్యాక్స్ ఓటీటీ ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న ఇతర మలయాళ సినిమాల మ...