Hyderabad, ఆగస్టు 3 -- టాలీవుడ్ వెర్సటైల్ హీరో సత్యదేవ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి నటంచిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా చిత్రం కింగ్డమ్. జూలై 31న థియేటర్లలో విడుదలైన కింగ్డమ్ మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన కింగ్డమ్ సక్సెస్ ఈవెంట్‌లో హీరో సత్యదేవ్, నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. "కింగ్‌డమ్‌ సినిమాకు వస్తున్న స్పందన పట్ల సంతోషంగా ఉంది. సినిమాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు కృతఙ్ఞతలు. ఈ చిత్రంతో నా సోదరుడు విజయ్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. విజయ్ గెలిస్తే నేను గెలిచినట్లే" అని అన్నాడు.

"సొంతంగా వచ్చి ఏదో సాధించాలి అనుకునే ఎందరికో విజయ్ దేవరకొండ స్ఫూర్తి. అలాంటి విజయ్ దేవరకొండ గెలవడం ఆనందంగా ఉంది. నాగవంశీ గారు డేరింగ్ ప్రొడ్యూసర్. అందరూ భ...