భారతదేశం, నవంబర్ 13 -- టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన జంట.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. ఈ జోడీ ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు ఈ లవ్ బర్డ్స్. అయితే తమ రిలేషన్‌షిప్ గురించి మాత్రం చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో వీరి నిశ్చితార్థం ప్రైవేట్‌గా జరిగినప్పటికీ, ఆ విషయాన్ని బయటపెట్టలేదు. అయితే ఎట్టకేలకు వీళ్ల లవ్ ను పబ్లిక్ గా బయటపెట్టారు.

హైదరాబాద్‌లో జరిగిన రష్మిక మందన్న కొత్త సినిమా 'ది గర్ల్‌ఫ్రెండ్' సక్సెస్ ఈవెంట్‌లో వీరిద్దరి ప్రేమకు సంబంధించిన ఓ దృశ్యం అభిమానుల కంటపడింది. తన కాబోయే భార్య రష్మిక మందన్న కోసం విజయ్ దేవరకొండ 'ది గర్ల్‌ఫ్రెండ్' ఈవెంట్‌కు వచ్చాడు. ఈ సందర్భంగా రష్మిక చేతిని పట్టుకుని విజయ్ ముద్దు పెట్టాడు.

బహిరంగంగా వారి ప్రేమను ఇలా ప్రదర్శించడం ఇదే మొదటిసా...