Hyderabad, మే 26 -- మీరు గమనించారా కొందరు మనుషులుంటారు వారు ఎక్కడికి వెళ్ళినా, ఎంత మందిలో ఉన్నా అందరి దృష్టి వారిపైనే ఉంటుంది. వాళ్ళు మాట్లాడితే అందరూ ఆసక్తిగా వింటారు, వారి మాటలకు విలువనిస్తారు. వారు అడిగింది అడిగినట్లు చేస్తారు, చెప్పింది చెప్పినట్లు వింటారు. ఇదంతా యాదృచ్చికమో లేక వారి అదృష్టమో అనుకుంటే మీరు పొరపడ్డట్టే.

ఎందుకంటే.. ఇది ఒక రకమైన తెలివైన అలవాటు. ప్రత్యేకమైన ప్రవర్తనా విధానం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. కొన్ని రకాల అలవాట్లు ఉన్నవారిని అందరూ ఇష్టపడతారు, వారి మాటలను శ్రద్ధగా వింటారు, వారిని ఇష్టంగా చూసుకుంటారు.

మీరు కూడా ఇలా గుంపులో గోవిందంలా కాకుండా ప్రత్యేకంగా నిలబడాలి అని అనుకుంటున్నారా? మీ మాటలకు విలువ పెరగాలని కోరుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే! జనసమూహంలో కూడా ప్రజలు మిమ్మల్ని ఇష్టపడటానికి సహాయపడే 4 అలవాట్లు ఏ...