Hyderabad, మే 8 -- ప్రేమలో ఎప్పుడూ అబ్బాయిలు.. అమ్మాయిలకు ఖరీదైన బహుమతులు ఇచ్చి వారిని సర్‌ప్రైజ్ చేయాలని చూస్తారు. ఒకప్పుడు బహుమతులకు అమ్మాయిలు పడేవారు కానీ.. ఇప్పుడు అమ్మాయిలు ఎంతో మారారు. అందమైన బహుమతులు, క్యాండిల్ లైట్ డిన్నర్లు, లగ్జరీ కార్లలో ప్రయాణాలకు వారు సంతోషించడం లేదు. వారికి నచ్చేలా అబ్బాయిలు చిన్న చిన్న ఆనందాలను ఇస్తే చాలు, వారు భావోద్వేగపరంగా కనెక్ట్ అయిపోతారు.

బంబుల్ ఇండియా అనే డేటింగ్ సైట్ ఇటీవల ఒక సర్వేను నిర్వహించింది. దీనిలో 61 శాతం మంది అమ్మాయిలు ప్రేమలో పడిన తర్వాత చిన్న చిన్న ఆనంద క్షణాలే తమకు ముఖ్యమని చెప్పారు. భాగస్వామి చేసే చిన్న చిన్న పనులే తమ హృదయాన్ని గెలుచుకుంటాయని వివరించారు. అతని నుంచి ఖరీదైన బహుమతులు, ఫైవ్ స్టార్ హోటల్లలో విందును తాము కోరుకోవడం లేదని అన్నారు.

రిలేషన్ షిప్ నిపుణులు ఈ సర్వే గురించి మాట్లాడ...