Hyderabad, ఏప్రిల్ 6 -- అందమైన అమ్మాయిలను చూడగానే అబ్బాయిల మనసు మంచులా కరిగిపోతుంది. కానీ ఆ అమ్మాయిని వివాహం చేసుకోమని అడగడానికి మాత్రం అబ్బాయిలు చాలా భయపడతారు. ఆమె ఆలోచనలోనే మునిగిపోతారు. కానీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి తన భావాలను వ్యక్తపరచడానికి మాత్రం ముందుకు అడుగయ్యరు. దాని వెనుక కారణం ఏంటో అధ్యయనాలు తేల్చి చెప్పాయి.

అమ్మాయిలు చూడగానే ఆకట్టుకునేలా ఉంటారు. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లో అందం ఎక్కువ. అది స్వతహాగా పుట్టుకతోనే వస్తుంది. అయితే అబ్బాయిలు అందమైన అమ్మాయి ముందుకు వెళ్లి పెళ్లి చేసుకోమని అడగడానికి ఎంతో సంకోచిస్తారు. అలాంటి అమ్మాయికి తాము అర్హులం కాదని భావిస్తారు. అందమైన అమ్మాయికి ధనవంతుడు, పెద్ద ఉద్యోగం ఉన్నవాడు వస్తాడని అనుకుంటూ ఉంటారు. తమలో ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్లే ఇలాంటి ఆలోచనలు చేస్తారు. ఆ అమ్మాయికి జీవితాంతం తన ప్రేమిక...