Hyderabad, మార్చి 5 -- అబ్బాయిలు అందంగా ఉండేందుకు చాలా స్టైలిష్ గా తయారవుతారు. అలా రెడీ అయి అమ్మాయిల ముందు తిరుగుతూ ఉంటారు. వారి ఉద్దేశం ప్రకారం హ్యాండ్సమ్ గా ఉంటే చాలు అమ్మాయిలు వారి ప్రేమలో పడిపోతారని అనుకుంటారు. కానీ అధ్యయనాల ప్రకారం అమ్మాయిలు అందగాడికి కాదు, కొన్ని రకాల లక్షణాలున్న అబ్బాయిలకు ఎక్కువగా పడే అవకాశం ఉంది. అలాంటి లక్షణాలు మీలో ఉన్నాయో లేవో చూసుకోండి.

అమ్మాయిలకు అబ్బాయిల మీద ఇష్టం కన్నా నమ్మకం ఎక్కువగా ఉండాలి. ఏ అబ్బాయిని అయితే వీరు నమ్మవచ్చు అనుకుంటారో ఆ అబ్బాయిలే వీరికి ఆకర్షణీయంగా కనిపిస్తారు. అలాగే అబ్బాయిల్లో ఉండే ఆత్మవిశ్వాసం కూడా వారికి ఎంతో నచ్చుతుంది. ఆత్మవిశ్వాసం అంటే అహంకారం అనుకోకండి. ఆత్మవిశ్వాసం అనుకుని అహంకారాన్ని ప్రదర్శించే అబ్బాయిలు కూడా ఎంతోమంది.

ఎదుటివారు చెప్పే విషయాన్ని ఓపికగా వినే గుణం అబ్బాయిలలో ఉం...