భారతదేశం, జూలై 25 -- ఏబీ డివిలియర్స్.. క్రికెట్ ఫ్యాన్స్ కు పరిచయం అక్కర్లేని పేరు ఇది. 360 డిగ్రీల ఆటతీరుతో, మైదానంలో బ్యాటింగ్ విధ్వంసంతో స్వదేశం, విదేశం అనే తేడా లేకుండా అందరికీ ఫేవరెట్ క్రికెటర్ అయిపోయాడు. కానీ అనూహ్యంగా 34 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు 41 ఏళ్ల వయసులో బ్యాట్ తో అతని విధ్వంసం చూశాకా.. ఎందుకు త్వరగా ఆటకు వీడ్కోలు పలికావని, ఐపీఎల్ వేలంలోకి వస్తావా? అని అభిమానులు అడుగుతున్నారు.

లెజెండ్స్ ప్రపంచ ఛాంపియన్ షిప్ (వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్) 2025లో సౌతాఫ్రికా ఛాంపియన్స్ తరపున ఏబీ డివిలియర్స్ ఆడుతున్నాడు. గురువారం (జులై 24) ఇంగ్లాండ్ ఛాంపియన్స్ తో మ్యాచ్ లో ఏబీ తన వింటేజీ బ్యాటింగ్ స్టైల్ ను ప్రదర్శించాడు. కేవలం 41 బంతుల్లోనే సెంచరీ సాధించి దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ జట్టుకు 10 వికెట్ల తేడ...