Hyderabad, ఏప్రిల్ 24 -- నేచురల్ స్టార్ నాని హీరోగా, నిర్మాతగా టాలీవుడ్‌లో వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇటీవలే కోర్ట్ మూవీతో ప్రొడ్యూసర్‌గా సాలిడ్ హిట్ అందుకున్న నాని హీరోగా నటించిన లేటెస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ హిట్ 3 ది థర్డ్ కేస్. హిట్ ఫ్రాంఛైజీలో వస్తోన్న మూడో సినిమా హిట్ 3కి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు.

హిట్ 3 మూవీ మే 1న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా యాంకర్ సుమ కనకాల ఇంట్రాగేషన్ పేరుతో ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు హీరో నాని ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చాడు.

"తెలుగు ఇండస్ట్రీలో ఉండే ఏ హీరో అయిన ఉంటే 70ఎంఎం స్క్రీన్‌పైన ఉండాలి. లేదా 40 ఫీట్ ప్రీ రిలీజ్ స్టేజ్ మీద ఉండాలి. కాదు కూడదు అని ఇలా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటే మేము ఇంట్రాగేషన...