భారతదేశం, జూన్ 21 -- జూన్ 21న యోగా దినోత్సవం సందర్భంగా రోజువారీ హడావిడి నుండి కాసేపు విరామం తీసుకుని, శ్వాస మీద ధ్యాస పెట్టి, మన జీవితాల్లో, ముఖ్యంగా మన కుటుంబాల్లోని చిన్నారుల జీవితాల్లో మానసిక స్పష్టత, సమతుల్యతను ఎలా తీసుకురావాలో ఆలోచిద్దాం. పిల్లలు పెరిగే ప్రపంచంలో స్క్రీన్‌లు వారి దినచర్యలో సింహభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. దానికి తోడు పాఠశాల ఒత్తిడి, ట్యూషన్లు, బిజీ షెడ్యూల్స్. పిల్లలు కూడా ఒత్తిడి కోరల్లో చిక్కుకుపోతున్నారు. ఇక్కడే యోగా తన పాత్రను పోషిస్తుంది. రోజువారీ ఒత్తిడిని నిర్వహించడానికి యోగా ఒక సంపూర్ణ మార్గం. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం, పిల్లలకు యోగాను పరిచయం చేసే కొత్త దినచర్యకు నాంది కావాలి.

బెంగళూరులోని క్షేమవన నేచురోపతి, యోగా సెంటర్ చీఫ్ వెల్‌నెస్ ఆఫీసర్ డాక్టర్ నరేంద్ర కె. శెట్టి చిన్న వయస్సు నుండే యోగా ప్రారంభించడం వల్...