Hyderabad, జూలై 18 -- నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న 'రామాయణం' భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు 'డ్యూన్', 'ఇంటర్‌స్టెల్లార్' వంటి సినిమాలకు సంగీతం అందించిన ప్రముఖ హాలీవుడ్ కంపోజర్ హన్స్ జిమ్మర్, ఇండియన్ మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ కలిసి సంగీతాన్ని అందిస్తున్నారు. కనెక్ట్ సినీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. 'రామాయణం' వంటి ప్రాజెక్ట్‌కు పనిచేయడం, హన్స్‌తో కలిసి సంగీతం సమకూర్చడంపై రెహమాన్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.

కాలంతో పాటు తనను తాను పునరావిష్కరించుకోవడం గురించి రెహమాన్ మాట్లాడుతూ.. భారతీయ సినిమాలో సినిమాలు తీసే విధానం, సంగీతం కూర్చే విధానం ఎంతగా మారిపోయిందో చూసి ఆనందం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత అతడు 'రామాయణం' గురించి ప్రస్తావిస్తూ.. "ఇంత పెద్ద ప్రా...