భారతదేశం, అక్టోబర్ 31 -- అండమాన్... అద్భుతమైన దీవుల సముదాయం. అందాలను వర్ణించలేని ద్వీపాలు, తెల్లటి ఇసుక బీచ్‌లు, మడ అడవులు, అటవీ అందాలు, కోరల్ ఐలాండ్స్ కు అండమాన్ చాలా ప్రసిద్ధి. ఇలా ఒకటి కాదు ఎన్నో అందాలను అస్వాదించేందుకు ఐఆర్సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. ఏపీలోని విశాఖపట్నం నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

ఈ ప్యాకేజీలో భాగంగా విశాఖపట్నం నుంచి ఉదయం 08:25 గంటలకు విమానం బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు పోర్ట్ బ్లెయిర్ చేరుకోరుతుంటారు టూరిస్టులు. హోటల్‌కు వెళ్లారు. హోటల్‌కి చెక్-ఇన్ చేసి...మధ్యాహ్నం సెల్యులార్ జైలు, కార్బిన్స్ కోవ్ బీచ్ విజిటింగ్ ఉంటుంది. తర్వాత సెల్యులార్ జైలులో లైట్ అండ్ సౌండ్ షోను ఆస్వాదిస్తారు. పోర్ట్ బ్లెయిర్‌లో రాత్రి భోజనం, బస చేస్తారు...