భారతదేశం, నవంబర్ 2 -- అండమాన్ వెళ్లి చూసి రావాలి అనుకునేవారికి మంచి అవకాశం. ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి ప్యాకేజీ నడుపుతోంది. AMAZING ANDAMAN EX HYDERABAD (SHA18) పేరుతో అందుబాటులో ఉంది. ఆరు రోజులు, 5 రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో తీసుకెళ్తారు. ఐఆర్‌సీటీసీ షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 21వ తేదీన టూర్ అందుబాటులో ఉంది.

హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఉదయం 6.25 గంటలకు ఫ్లైట్ బయలుదేరి శ్రీ విజయపురం(పోర్ట్ బ్లెయిర్) 08:55 గంటలకు చేరుకుంటుంది. ఇందుకోసం మీరు ఉదయం 4.35 వరకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకోవడం మంచిది. పోర్ట్ బ్లెయిర్ చేరుకున్నాక.. హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. భోజనం తర్వాత సెల్యులార్ జైలు మ్యూజియం, తరువాత కార్బిన్స్ కోవ్ బీచ్‌ను సందర్శిస్తారు. ఆపై సెల్యులార్ జైలులో లైట్ అండ్ సౌండ్ షోకు వెళ్తారు.

రెండో రోజు చెక్ అ...