భారతదేశం, ఏప్రిల్ 3 -- అండమాన్ నికోబార్ దీవుల్లోని నిషేధిత గిరిజన రిజర్వ్ నార్త్ సెంటినల్ ఐలాండ్‌లోకి ప్రవేశించినందుకు అమెరికా జాతీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు బుధవారం వెల్లడించారు. మార్చి 31న మిఖైలో విక్టోరోవిచ్ పొల్యాకోవ్(24)ను అరెస్టు చేశారు. అనుమతి లేకుండా నార్త్ సెంటినల్ ఐలాండ్ లోకి ప్రవేశించాడని పోలీసులు తెలిపారు.

మార్చి 26న పోర్ట్ బ్లెయిర్ చేరుకున్నాడు మిఖైలో. మార్చి 29వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కుర్మా డేరా బీచ్ నుంచి తన పడవలో బయలుదేరి సెంటినలీస్ ప్రజల కోసం కొబ్బరికాయలు, ఇతర సామాగ్రిని తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు.

ఉదయం 10 గంటలకు నార్త్ సెంటినల్ ద్వీపంలోని ఈశాన్య తీరానికి చేరుకున్నాడు మిఖైలో. బైనాక్యులర్లతో ఆ ప్రాంతాన్ని పరిశీలించినప్పటికీ నివాసితులెవరూ కనిపించలేదు. గంట సేపు ఒడ్డున ఉండి ఈలలు వేస్తూ ద్...