భారతదేశం, మే 27 -- మలయాళ సూపర్ స్టార్ మోహన్‍‌లాల్ హీరోగా నటించిన తుడరుమ్ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లు సాధించింది. తుడరమ్ చిత్రం సుమారు రూ.30కోట్ల బడ్జెట్‍తో రూపొందిందని అంచనా. పెద్దగా హైప్ లేకుండానే ఈ క్రైమ్ థ్రిల్లర్ ఏప్రిల్ 25న రిలీజ్ అయింది. అయితే తుడరుమ్ చిత్రం అంచనాలను దాటేసి ఆరంభం భారీ కలెక్షన్లను రాబట్టింది. ఏకంగా రూ.232కోట్ల గ్రాస్ కలెక్షన్లకుపైగా దక్కించుకుంది.

తుడరుమ్ చిత్రం భారీ బ్లాక్‍బస్టర్ అయినా ఐదు వారాల్లోనే ఓటీటీలోకి వస్తోంది. మరోవైపు థియేట్రికల్ రన్ ఇంకా సాగుతున్నా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. కాగా, ఓటీటీలో ఈ మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందనే ఆసక్తిగా ఉంది.

తుడరుమ్ చిత్రం మే 29వ తేదీన అంటే మరో రెండు రోజుల్లో జియోహాట్‍స్టార్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. మలయాళంతో పాటు త...