భారతదేశం, అక్టోబర్ 7 -- విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో ప్రధానం ఘట్టమైన సిరిమానోత్సవం ఘనంగా ప్రారంభమైంది. చదరగుడి నుంచి విజయనగరం కోట వరకు సిరిమానును ఊరేగిస్తారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా పాల్గొంటారు.

పాలధార, తెల్ల ఏనుగు, జాలరివల, అంజలి రథం ఊరేగింపుగా వెళ్తుంటే అమ్మవారి సిరిమాను ముందుకు వెళ్తోంది. గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు సిరిమానును దర్శించుకున్నారు. మరోవైపు బొత్స సత్యనారాయణ తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు. పైడితల్లి అమ్మవారి ఉత్సవాల కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసింది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంది.

పైడితల్లి ఉత్సవాల్లో భాగంగా సోమవారం తొలేళ్లు ఉత్సవంగా జరిగింది. ఆలయ ధర్మకర్తలైన పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు తమ పుట...