భారతదేశం, జనవరి 24 -- బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ కు ఓ షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ ఈవెంట్ కోసం వెళ్లిన ఆమె వేధింపులు ఎదుర్కొంది. ఈ విషయాన్ని శనివారం (జనవరి 24) ఇన్ స్టాగ్రామ్ స్టోరీల్లో వెల్లడించింది మౌనీ రాయ్. వాళ్ల కూతుళ్లకు, సిస్టర్స్ కు ఇలాగే జరిగితే ఊరుకుంటారా? అని ప్రశ్నించింది ఈ భామ.

తాను ఇటీవల ప్రదర్శన ఇచ్చిన కార్యక్రమంలో ఎదుర్కొన్న వేధింపుల గురించి నటి మౌనీ రాయ్ బహిరంగంగా వెల్లడించింది. కార్యక్రమంలో పాల్గొన్న, తాతయ్యలుగా పిలుచుకునే వయస్సులో ఉన్న ఇద్దరు వ్యక్తుల ప్రవర్తన కారణంగా తాను అవమానకరంగా, షాక్ కు గురయ్యానని మౌనీ తెలిపింది. వేధింపులకు గురయ్యాయని ఆమె ఆరోపించింది.

''నిన్న కర్నాల్‌లో ఒక కార్యక్రమం జరిగింది. అందులో పాల్గొన్న అతిథుల ప్రవర్తన, ముఖ్యంగా తాతయ్యలుగా పిలుచుకునే వయస్సులో ఉన్న ఇద్దరు అంకుల్స్ ప్రవర్తన నాకు అసహ్యం కల...