భారతదేశం, జనవరి 22 -- Warangal Street Dogs: వరంగల్‌ నగరంలో రోజుకు కనీసం పది మంది కుక్క కాటుకు గురవుతుండగా.. గతేడాది యూపీ నుంచి వలస వచ్చిన కుటుంబంలోని ఓ ఏడేండ్ల బాలుడిని కుక్కలు కరిచి చంపేయడం అప్పట్లో కలకలం రేపింది. ఇదిలాఉంటే ఆదివారం సాయంత్రం మళ్లీ కుక్కలు బీభత్సం సృష్టించాయి.

వరంగల్ నగరంలోని 21వ డివిజన్​ కు చెందిన ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేయగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా చిన్నారులపై కుక్కల దాడి ఘటన నేపథ్యంలో స్థానిక మంత్రి కొండా సురేఖ ఆఫీసర్లపై సీరియస్​ అయ్యారు. కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

గ్రేటర్​ వరంగల్ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో 40 వేలకుపైగానే కుక్కలున్నట్లు మున్సిపల్​ ఆఫీసర్లు గతంలోనే గుర్తించారు. తరచూ కుక్కల దాడులు చోటుచేసుకుంటుండటంతో వాటి నియంత్రణకు స్టెరిలైజేషన్ ప్రక్...