భారతదేశం, మే 9 -- Chakshu portal: టెలీకాం శాఖ మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగించే హ్యాండ్ సెట్ లను, మొబైల్ నంబర్లను బ్లాక్ చేస్తోంది. వాయిస్ కాల్స్ ద్వారా, టెక్స్ట్ సందేశాల ద్వారా మొబైల్ వినియోగదారులను మోసం చేయడానికి ఈ హ్యాండ్ సెట్స్ ను, మొబైల్ నంబర్లను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి మోసగాళ్లను గుర్తించేందుకు టెలికాం శాఖ ఈ ఏడాది చక్షు పోర్టల్ (Chakshu portal) ను ప్రారంభించింది. మీరు కూడా ఆ పోర్టల్ లో మీకు వచ్చే స్కామ్ కాల్స్ పై రిపోర్ట్ చేయవచ్చు.

మొబైల్ లో ఫిషింగ్ సందేశాలు పంపిస్తున్న 52 సంస్థలను టెలికాం శాఖ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఇప్పటివరకు 348 మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసింది. 10834 అనుమానిత మొబైల్ నంబర్లను రీ వెరిఫికేషన్ కోసం గుర్తించింది. వీటిలో 8,272 మొబైల్ కనెక్షన్లను డిస్కనెక్ట్ చేసింది. మీరు కూడా అటువంటి మోసాల బారిన పడినట్లయితే, ...