Hyderabad, మే 9 -- ETV Win OTT Movies Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు ఇలా అనేక భాషలకు సంబంధించిన సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ చేస్తుంటారు. అయితే, కేవలం తెలుగు భాషలో స్ట్రీమింగ్ చేసే ఓటీటీ సంస్థలు మాత్రం చాలా అరుదు.

ప్రస్తుతం తెలుగు భాషలో సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ చేసే ఓటీటీ సంస్థలు రెండే ఉన్నాయి. వాటిలో ఆహా ఓటీటీ (Aha OTT) ఒకటి అయితే, మరొకటి ఈటీవీ విన్ (ETV Win OTT). ఈ రెండు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులను తెలుగు భాషలో స్ట్రీమింగ్ చేస్తుంటాయి. ఈ మధ్య కాలంలో అతి ఎక్కువగా తెలుగు కంటెంట్‌ను అందుబాటులో ఉంచుతూ దూసుకుపోతోంది ఈటీవీ విన్.

అలాంటి ఈటీవీ విన్ ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే (మే 9) రెండు సినిమాలు తెలుగులో స్ట్రీమిం...