భారతదేశం, మార్చి 12 -- Hyundai Creta N Line launched in India : ఇండియాలో హ్యుందాయ్​కు బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీగా ఉన్న క్రేటాలో కొత్త ట్రిమ్​ని లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. దీని పేరు హ్యుందాయ్​ క్రేటా ఎన్​ లైన్​. ఈ ఎన్​ లైన్​ ట్రిమ్​ వస్తున్న మూడో హ్యుందాయ్​ కారు ఈ క్రేటా ఎస్​యూవీ. ఇప్పటికే.. ఐ20, వెన్యూల్లో ఎన్​ లైన్​ ఉంది. ఈ నేపథ్యంలో.. కొత్త వెహికిల్​ ఫీచర్స్​, ధర వివరాలను ఇక్కడ చూసేద్దాము..

స్టాండర్డ్​ క్రేటా ఎస్​యూవీతో పోల్చితే.. ఈ హ్యుందాయ్​ క్రేటా​ ఎన్​ లైన్​ బంపర్స్​, గ్రిల్​లో స్వల్పంగా మార్పు కనిపిస్తుంది. పైగా దీనికి రెడ్​ యాక్సెంట్స్​ వస్తున్నాయి. 18 ఇంచ్​ రీ-డిజైన్డ్​ అలాయ్​ వీల్స్​, రేర్​ స్పాయిలర్​, డ్యూయెల్​ ఎగ్జాస్ట్​ టిప్స్​ వంటివి కూడా లభిస్తున్నాయి.

ఈ ఎస్​యూవీలో మూడు మోనోటోన్​, ఒక డ్యూయెల్​ టోన్​ కలర్​ ఆ...