భారతదేశం, మార్చి 12 -- Ducati Streetfighter: డుకాటీ ఇండియా భారత మార్కెట్లో డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వీ4 (Ducati Streetfighter V4), డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వీ4 ఎస్ (Ducati Streetfighter V4 S) లను విడుదల చేసింది. స్ట్రీట్ ఫైటర్ వీ4 ధర రూ.24.62 లక్షలుగా, వీ4 ఎస్ డుకాటీ రెడ్ కలర్ ధర రూ.27.80 లక్షలుగా, వీ4 ఎస్ గ్రే నీరో కలర్ ధర రూ.28 లక్షలుగా నిర్ణయించారు. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. డుకాటీ నుంచి వచ్చిన ఈ కొత్త స్ట్రీట్ ఫైటర్ సిరీస్ మోటార్ సైకిళ్లు మార్కెట్లో బిఎమ్ డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ ఆర్ (BMW S 1000 RR), కవాసాకి జెడ్ హెచ్ 2 (Kawasaki Z H2) లకు పోటీగా ఉంటాయి.

డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వీ4 (Streetfighter V4), డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వీ4 ఎస్ (Streetfighter V4 S) మోటార్ సైకిళ్లలో 1,103 సీసీ డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 13,0...