భారతదేశం, మార్చి 4 -- BRS KTR on LRS: అధికారంలోకి రావడానికి 420 హామీలు ఇచ్చి, వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు, ఐదేళ్లలో 414 హామీలు అమలు చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ Congress ఇప్పుడు మోసం చేస్తోందని బిఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ Working pResident కేటీఆర్ ఆరోపించారు.

లే ఔట్ క్రమబద్దీకరణ పేరుతో తెలంగాణలో ప్రజల నుంచి రూ.20వేల కోట్లను తోలు ఒలిచి వసూలు చేయడానికి సిద్ధం అయ్యారని, మార్చి 31లోపు ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు నిర్ణయించడం ఏమిటని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు క్రమద్దీకరణ ఉచితంగా చేస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమాయ్యారని ప్రశ్నించారు. మంత్రులు భట్టి, సీతక్క ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

అప్పట్లో ప్రజల్లో మీద భారం మోపుతున్నారని ఆరోపించి ఇప్పుడు 20వేల కోట్ల భారాన్ని మధ్య తరగతి ప్రజలపై మోపేందుకు సిద్ధమయ్యారని, ఎల్‌ఆర్‌ఎస్‌ LRS ...