భారతదేశం, మార్చి 5 -- మీరు ప్రతిరోజూ అల్పాహారంగా అదే పల్లి చట్నీ చేస్తారా? ఈ చట్నీని తక్కువ సమయంలో దాదాపు ప్రతి ఒక్కరి ఇళ్లలో సులభంగా తయారు చేసుకోవచ్చు. సాధారణంగా దోసె, ఇడ్లీలోకి ఎక్కువగా ఇదే చేస్తారు. అయితే కొత్తగా ఏదైనా చేయండి. రుచికి రుచి కూడా దొరుకుతుంది.

అల్పాహారంలోకి అదే పల్లి చట్నీ ఎక్కువ రోజులు తింటే బోర్ కొడుతుంది కదా. దీని కోసం స్పైసీ చట్నీని తయారు చేసి ప్రయత్నించండి. ఇంట్లో మసాలా, టమోటా చట్నీ ప్రయత్నించండి. దోస లేదా ఇడ్లీలను తయారుచేసేటప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌ల రుచిని మెరుగుపరచడానికి ఈ చట్నీ బాగుంటుంది. కొత్త రుచి దొరుకుతుంది. దీనిని 1 నిమిషంలోనే తయారుచేయవచ్చు. 1 నిమిషం స్పైసీ చట్నీ రెసిపీ కింది విధంగా చేయాలి.

1 నిమిషం చట్నీకి కావలసిన పదార్థాలు : పెద్ద ఉల్లిపాయ - 2, టొమాటో - 3, వెల్లుల్లి - 5, ఎండు మిరియాలు - 5, చింతపండు - కొద్ది...